పెళ్ళికి ముందే శృంగారం తప్పేం లేదు: కైరా

నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శృంగారం గురించి మాట్లాడుకునే వాళ్లమని అయితే పెళ్ళికి శృంగారం లో పాల్గోనడం తప్పు అని అనుకునే వాళ్ళమని, ఆ తతంగమంతా పెళ్లి తర్వాతే చేసుకోవాలని చర్చకు వచ్చేదని కానీ సినిమాల్లోకి వచ్చాక అర్ధమయ్యింది శృంగారంలో పాల్గొనడం తప్పు కాదని అది వాళ్ళ వాళ్ళ ఇష్టమని సంచలన వ్యాఖ్యలు చేసింది కైరా అద్వానీ .ఇటీవల ఓ శృంగారాత్మక చిత్రమైన ‘లస్ట్ స్టోరీస్’ లో చాలా బోల్డ్ గా నటించింది . దాంతో శృంగారం పై బాగానే మాట్లాడుతోంది. పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొంటే అందులో తప్పేం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంలో నటించిన కైరా అద్వానీ.

ఎం ఎస్ ధోని బయోపిక్ చిత్రం ఈ భామకు బాగా గుర్తింపు వచ్చింది . ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన వెంటనే నటించే చాన్స్ వచ్చింది , భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తతం చరణ్ సరసన నటిస్తోంది . ఇప్పడు ఏ మగాడి దగ్గరైతే మంచి సువాసన వస్తుందో అలాంటి మగాడు అంటే నాకు చాలా చాలా ఇష్టం అని అంటోంది అంతేకాదు పెళ్లి కి ముందే శృంగారంలో పాల్గొంటే తప్పు లేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ బ్యూటీ.