‘విశ్వామిత్ర’గా రానున్న క‌మెడియ‌న్ సత్యం రాజేష్

హస్యనటులు హీరోలుగా తమ కెరీర్‌ను మార్చుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. సునీల్‌, ధన్‌రాజ్‌, సప్తగిరి, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్‌ వంటి కమెడియన్లు హీరోలుగా ప్రయత్నించి ఇక్కడ రాణించాలన్న కసితో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో సత్యం రాజేష్ కూడా హీరో అవుతున్నాడు. కమెడియన్లకు హీరోయిజం కలిసిరావడం లేదన్న విమర్శలున్నా వీళ్ల మొండి పట్టుదలను హర్షించేవాళ్లూ ఉన్నారు.

సీరియర్ల దారిలోనే కమెడియన్‌ రాజేష్ ‘విశ్వామిత్ర’ అనే చిత్రంలో హీరోగా కనిపించబోతున్నాడు. గీతాంజలి ఫేం రాజ్‌కిరణ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వామిత్ర టైటిల్‌ లోగో ఆవిష్కరణలో ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర సంగతుల్ని వెల్లడించారు. ప్రేమకథా చిత్రం, గీతాంజలి తరహాలోనే ఈ చిత్రం కూడా ఓ కామెడీ హర్రర్ చిత్రమని తెలిపారు. ఈ చిత్రం రాజేష్‌ కెరీర్‌కి ఎంతవరకూ కలిసి వస్తుందో చూడాలి.