‘సవ్యసాచి’ మరోసారి వాయిదా

యాక్షన్ థ్రిల్లర్ ఫార్మాట్‌లో అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న సినిమా “సవ్యసాచి”. ఈ సినిమాలో చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. తొలుత ఈసినిమాను ఈ వేసవిలో రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేసినా అది మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటోంది. వచ్చేనెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఓ వైపు చివరి షెడ్యూల్‌ షూటింగ్ జరుగుతుండగానే మరో వైపు డబ్బింగ్‌ పన్నులు మొదలుపెట్టారు. ఈ సినిమాను జూన్‌లో రిలిజ్‌ చేయాలని మొదట భావించిన తరువాత కొన్ని సాంకేతిక కారణాల వల్ల జూలైకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడన పరిస్థితులో అప్పటికి రావాడం కూడా కష్టమేనన్న మాట వినిపిస్తోంది. ఈ వాయిద పై చైతూ ఫ్యాన్స్‌ కాస్తంత సీరియస్‌గానే ఉన్నారు. చైతూ టీమ్‌ ఈ సినిమాతో ఎట్టి పరిస్థితిలో బ్లాక్‌బస్టర్‌ కొట్టాలన్న కసితో పని చేస్తోంది. ఆ క్రమంలోనే అవసరం మేర రీషూట్‌కు ప్లాన్‌ చేశారట. రీషూట్లు అంటే కాస్త ఎక్కువ సమయమే వెచ్చించ్చాల్సి ఉంటుంది. కాబట్టి ఆగష్టులో కానీ రిలీజ్‌ చేయలేని సన్నివేశం ఉంటుందని చెబుతున్నారు. ఎవరేం చేసినా అదంతా పెర్ఫెక్షన్‌ కోసమే. ప్రచారకార్యక్రమాల్లో సవ్యసాచి టీమ్‌ ఈ ఆలస్యానికి కారణం ఏం చెబుతుందో వేచి చూడాలి.