వెనక్కి తగ్గిన ‘డియర్ కామ్రేడ్’!

యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ నటించిన న్యూ మూవీ ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 31న విడుదలకావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం మేరకు ఈ విడుదల జూన్ నెలకు వాయిదాపడినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం నాలుగు భాషల్లోనూ ఒకేసారి చిత్రాన్ని విడుదలచేయాలనుకుంది. కానీ మే 31న సూర్య ‘ఎన్.జి.కె’ విడుదలకానుంది. తమిళ, తెలుగు రెండు చోట్ల ఈ సినిమా ఒకేసారి వస్తుండటంతో వసూళ్ల మీద ఎఫెక్ట్ పడుతుందని వాయిదా నిర్ణయం తీసుకున్నారట ‘డియర్ కామ్రేడ్’ నిర్మాతలు.