సొంత బ్యానర్ లో శౌర్య సినిమా ప్రారంభం!

నాగ‌శౌర్య హీరోగా, క‌న్న‌డ‌లో ‘కిరాక్ పార్టీ’ అనే చిత్రంలో త‌న క్యూట్ ఫెర్‌ఫార్మెన్స్ తో అంద‌రి మ‌న‌సులు దోచుకున్న ర‌ష్మిక మండ‌న్న‌ని హీరోయిన్ గా టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ చేస్తూ… వెంకీ కుడుములని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ, ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మాత‌లు ఉషా మూల్పూరి, శంక‌ర ప్ర‌సాద్ మూల్పూరి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్ హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టగా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజేష్ కిలారు కెమెరా స్విఛాన్ చేశారు. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రిగే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెలాఖరులో ప్రారంభమౌతుంది. ఈ సంద‌ర్బంగా..
శంక‌ర ప్ర‌సాద్‌ మూల్పూరి మాట్లాడుతూ.. ”మా అబ్బాయి నాగ‌శౌర్యతో చిత్రాన్ని నిర్మించాల‌ని ఎప్ప‌టినుంచో అనుకుంటున్నాము. త్రివిక్ర‌మ్ గారి అసోసియేట్ వెంకి కుడుముల చెప్పిన క‌థ మాకు న‌చ్చి మా బ్యాన‌ర్ లోనే చేయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాము” అని అన్నారు.
హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ”ఇకపై మా బ్యానర్ లో మంచి చిత్రాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. ఈనెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తున్నాం” అని అన్నారు.
హీరోయిన్ రష్మిక మాట్లాడుతూ.. ”నా డెబ్యూ తెలుగు చిత్రం ఇది. ఓ మంచి కథతో, క్యారెక్టర్ తో తెలుగులో లాంచ్ అవుతున్నందకు చాలా హ్యాపీగా ఉంది” అని అన్నారు.
ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ.. ”నాకు ఇంత మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన హీరో నాగ‌శౌర్య గారికి , నిర్మాత‌లు ఉషా ముల్పూరి, శంక‌ర‌ప్ర‌సాద్ ముల్పూరి గారికి ధ‌న్య‌వాదాలు. నాగ‌శౌర్య కి జంట‌గా ర‌ష్మిక మండ‌న్న‌ న‌టిస్తుంది. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం” అని అన్నారు.