HomeTelugu Trendingరాజశేఖర్‌ ‘మర్మాణువు’ టైటిల్‌ పోస్టర్‌

రాజశేఖర్‌ ‘మర్మాణువు’ టైటిల్‌ పోస్టర్‌

Rajasekhar new Movie Title

హీరోగా రాజశేఖర్‌ వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పెగాసస్‌ సినీ కార్ప్‌ ఎల్‌ఎల్‌పి, మహాయాన మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ‘మర్మాణువు’ టైటిల్‌ ఖరారు చేశారు. గురువారం దర్శకుడు పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ లోగోను విడుదల చేశారు. టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. ‘‘దర్శకుడు చక్కని కథ చెప్పారు. కథ, కథనానికి తగ్గట్టుగా టైటిల్‌ కుదిరింది. ఇందులో రాజశేఖర్‌ గారి పాత్ర సంథింగ్‌ స్పెషల్‌ అని చెప్పాలి. చిత్రీకరణ, ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని నిర్మాతలు శివాని, శివాత్మిక, విజయ ప్రవీణ పరుచూరి చెప్పారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu