HomeTelugu Newsప్రముఖ సినీ విమర్శకుడు మృతి

ప్రముఖ సినీ విమర్శకుడు మృతి

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు, సినీ విమర్శకుడు కేఎన్‌టీ శాస్త్రి కన్నుమూశారు. 1945లో జ‌న్మించిన ఆయ‌న దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా జాతీయ అవార్డులను అందుకున్నారు.ఆయ‌న‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శాస్త్రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ తిలదానం, సురభి, (డాక్యుమెంటరీ) చిత్రాలకు జాతీయ అవార్డుతో పాటు నంది అవార్డు ద‌క్కాయి. . కొన్ని కన్నడ చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు.

1 15

ద‌ర్శ‌కునిక‌న్నా సినీ విమ‌ర్శ‌కునిగా కేఎన్‌టీ శాస్త్రికి మంచి పేరుంది. వివిధ కేట‌గిరీల‌లో ఆయ‌న‌కు ఆరు జాతీయ అవార్డులు వ‌చ్చాయి. పలు చలన చిత్రోత్సవాలకు ఆయన జ్యూరీ సభ్యుడిగా పనిచేశారు. సినీ విమర్శకుడిగా శాస్త్రి పలు పుస్తకాలు కూడా రాశారు. 2006లో నందితా దాస్‌ హీరోయిన్‌గా శాస్త్రి తెరకెక్కించిన కమిలి చిత్రాన్ని దక్షిణ కొరియాలోని బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దర్శకుడిగా, రచయితగా, విమర్శకుడిగా ఆయన ఏడు జాతీయ అవార్డులు, 12 అంతర్జాతీయ అవార్డులను అందుకోవడం గమనార్హం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu