Homeతెలుగు Newsహరికృష్ణ పొలిట్ బ్యూరో స్థానంలోకి ఎవరు?

హరికృష్ణ పొలిట్ బ్యూరో స్థానంలోకి ఎవరు?

నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చ జరుగుతోంది. చనిపోయే నాటికి హరికృష్ణ టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానంలో పార్టీలో ఎవరిని భర్తీ చేస్తారన్న అంశంపై పార్టీలో ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. నందమూరి కుటుంబంలోనే ఒకరికి ఇస్తారా.. లేక వేరే వారిని తీసుకుంటారా అనేదానిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.

15

నందమూరి కుటుంబంలోనుంచి అయితే ఆ స్థానంలోవచ్చే వారెవరనే అంశం ఆసక్తి రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబం యాక్టివ్ రోల్ పోషించనుందని అందరూ భావించారు. చిన్న చిన్న ఇబ్బందులను పక్కన పెట్టి రాష్ట్రంకోసం, పార్టీ కోసం పార్టీని తిరిగి అధికారంలోకి తేవాలంటే ఎన్టీఆర్ కుటుంబం పూర్తిగా టీడీపీకి బ్యాక్‌బోన్‌గా నిలవాల్సిన అవసరముందని అనుకున్నారు. ఆ దిశగా కుటుంబ పెద్దలు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు వెలువడ్డాయి. ఇంతలోనే హరికృష్ణ హఠాన్మరణం పార్టీ అభిమానులను, ప్రత్యేకించి నందమూరి ఫ్యాన్స్‌ను తీవ్ర వేదనకు గురిచేసింది. కొంతకాలంగా హరికృష్ణ టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నా పొలిట్ బ్యూరో సభ్యునిగా కొనసాగించారు చంద్రబాబు. ఇటీవలి జరిగిన కొన్ని పరిణామాలు విశ్లేషిస్తే నందమూరి కుటుంబాన్ని పార్టీకి దగ్గర చేసే ప్రయత్నాలు మళ్లీ జరిగాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఇప్పుడు హరికృష్ణ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది చర్చగా మారింది.

16

హరికృష్ణ స్థానాన్ని నందమూరి కుటుంబం నుంచే భర్తీ చేస్తే బాగుంటుందని టీడీపీలోని కొందరు అంటున్నారు. ఈక్రమంలోనే బాలకృష్ణ పేరు ప్రధానంగా చర్చకు వస్తోంది. హరికృష్ణ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో ప్రచారం చేపట్టినా ఆ తర్వాత రాజకీయాల జోలికి రాలేదనే చెప్పాలి. పైగా తానిప్పుడే రాజకీయాల్లోకి రానని 20 ఏళ్ల పాటు కళా సేవ చేస్తానని గతంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించారు. అందువల్ల హరికృష్ణ స్థానాన్ని బాలకృష్ణతో భర్తీ చేస్తే బాగుంటుందనే సూచనలు వస్తున్నాయి. బాలయ్య ఇ్పటికే రాజకీయాల్లో క్రియా శీలకంగా వ్యవహరిస్తుండటంతో పాటు హిందూపురం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నందున ఆయన్నే పొలిట్ బ్యూరోకు పంపితే నందమూరి ఫ్యాన్స్ కూడా సంతోషిస్తారని అంటున్నారు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పొలిట్ బ్యూరోలో నందమూరి కుటుంబం తప్పనిసరిగా ఉండాలని పార్టీలో ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఈ క్రమంలోనే హరికృష్ణ స్థానాన్ని బాలయ్యతో భర్తీ చేస్తే బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu