15 నిమిషాల కోసం ఐదు కోట్లు!

ఇండియాలో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయింది. త్వరలో ఐపీఎల్ 11వ ఎడిషన్ ప్రారంభం కాబోతోంది. దీని ప్రసార హక్కుల కోసం పలు స్పోర్ట్స్ టీవీ ఛాన్సల్స్ వందల కోట్లు ఖర్చు చేశాయి. ఇక బాలీవుడ్ లో ఎన్నో వివాదాల మద్య రిలీజ్ అయిన పద్మావత్‌ సినిమా విజయంతో బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మంచి క్రేజ్ లో ఉన్నాడు. ఐపీఎల్‌ 2018 ప్రారంభ వేడుకల్లో పలువురు బాలీవుడ్‌ నటులు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యారు.ఐపీఎల్ 11వ ఎడిషన్ ఏప్రిల్‌ 7న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రారంభ వేడుక కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన రణ్‌వీర్‌ తీసుకుంటున్న పారితోషకం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. కేవలం 15 నిమిషాల పాటు సాగనున్న ప్రదర్శనకు ఏకంగా రూ. 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారట నిర్వాహకులు. దీని బట్టి ఆడియన్స్ లో రణవీర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అరధమవుతోంది!