HomeTelugu News20 సినిమాల తర్వాతే పిల్లలు : శ్రియ

20 సినిమాల తర్వాతే పిల్లలు : శ్రియ

‘ఇష్టం’ సినిమాతో తెలుగులో తెర అరంగేట్రం చేసిన నటి ‘శ్రియ’ ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. అంతేకాదు కెరీర్‌ మొదట్లో ఎంత గ్లామరస్‌గా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్‌తో ఆకట్టుకొంటుంది. ఇటీవలె శ్రియ రష్యాకు చెందిన ఆండ్రూ కొశ్చేవ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా సినిమాలు అంగీకరిస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది శ్రియ.

4 18

ప్రస్తుతం నిహారికతో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. ఇందకుముందులాగానే తన కెరీర్‌ను కొనసాగిస్తానని శ్రియ చెప్పుకొచ్చింది. ‘అప్పుడే వైవాహిక జీవితానికి పరిమితమైపోవాలనుకోవడం లేదు. కనీసం మరో 20 సినిమాలైనా చేయాలి. ఇప్పటికీ నాకంటూ కొన్ని సినిమాలు ఉన్నాయి. చేయాల్సిన పాత్రలున్నాయి. కాబట్టి నటనను ఇప్పట్లో ఆపను. పెళ్లెతే నటించకూడదని రూల్‌ ఏమీ లేదు కదా. ఇప్పుడే పిల్లల గురించి ఆలోచించడం లేదు 20 సినిమాల తర్వాతే పిల్లల గురించి ఆలోచిస్తాన’ని శ్రియ చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!