‘ఆర్ఆర్ఆర్‌’ భారీ బడ్జెట్‌తో ఇంటర్వెల్ ఎపిసోడ్‌

ఆర్ఆర్ఆర్ మూవీ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎన్టీఆర్ పై షూటింగ్ జరుగుతుంది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ను ఎన్టీఆర్ పై షూట్ చేస్తున్నారట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టాంజానియా నుంచి తిరిగి వచ్చారు. రేపోమాపో చరణ్‌ కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఇంటర్వెల్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ. 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంట. ఈ స్థాయిలో ఒక ఎపిసోడ్ కోసం ఖర్చు చేయడం అంటే మాటలు కాదు.