HomeTelugu Big Storiesఢిల్లీ వీధుల్లో దీపికా.. చిరాకు పడిన నెటిజన్లు..

ఢిల్లీ వీధుల్లో దీపికా.. చిరాకు పడిన నెటిజన్లు..

2 6

బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొణె టైటిల్‌ రోల్‌ పోషించిన సినిమా ‘ఛపాక్‌’. ఈ చిత్రానికి మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించారు. యాసిడ్‌దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా జనవరి 10న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం దీపిక యాసిడ్‌ బాధితురాలి లుక్‌లో నటించారు. అంతేకాదు ఈ చిత్రం షూటింగ్‌ ఢిల్లీ వీధుల్లో జరుగుతున్నా.. ఎవరూ దీపికను గుర్తుపట్టలేదు.

కాగా యాసిడ్‌ దాడి బాధితుల పట్ల సమాజం ఎలా ప్రవర్తిస్తుందో చూపించేందుకు ‘ఛపాక్‌’ టీం సూపర్‌ మార్కెట్‌, దుస్తులు, ఫ్యాన్సీ దుకాణాల్లో రహస్యంగా కెమెరాలు ఉంచింది. దీపిక ‘మాలతి’ (సినిమాలోని పాత్ర పేరు) గెటప్‌లో తయారై కొంత మంది యాసిడ్‌ దాడి బాధితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లారు. దుకాణాల్లో వీరిని చూసి కొందరు చిరాకు, విసుగు తెచ్చుకున్నారు. మరికొందరు స్నేహంగా పలకరించారు. బాధితుల పట్ల సమాజం తీరు మారాలనే సందేశం ఇస్తూ ఈ వీడియోను రూపొందించారు. సాధారణంగా దీపిక ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఆమె చుట్టూ భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడుతుంటారు. అలాంటి ఆమెకు ఇది ఓ కొత్త అనుభవం అని చెప్పొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!