HomeTelugu Trendingరేపిస్టులు అంటే నీలా ఉంటారు.. నెటిజన్‌పై మాధవీలత ఫైర్

రేపిస్టులు అంటే నీలా ఉంటారు.. నెటిజన్‌పై మాధవీలత ఫైర్

16
వెటర్నరీ వైద్యురాలు దిశా హత్యాచారం ఘటన నేపథ్యంలో టీజింగే హీరోయిజమా? పేరుతో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన స్పెషల్ డిస్కషన్ లో నటి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ అత్యాచారం ఘటనపై సీఎం కేసీఆర్ వెంటనే ఎందుకు స్పందించలేదని సోషల్ మీడియాలో నిలదీసినందుకు ఓ నెటిజన్‌ నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. ఆ నెటిజన్ చేసిన కామెంట్ తనను చాలా బాధించిందన్నారు. రేపిస్టులు ఎలా ఉంటారో ఫస్ట్ టైమ్ కళ్లారా చూశాను అన్నారు.

దిశ ఘటనలో సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తూ తాను ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశానని నటి మాధవీలత చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే.. మీరు ఎందుకు స్పందించడం లేదు. ఇంకా ఎన్నాళ్లు టైమ్ తీసుకుంటారు అని ప్రశ్నిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టానని అన్నారు. దీనికి చాలామంది కామెంట్లు చేశారని.. ఓ వ్యక్తి మాత్రం చాలా దారుణంగా కామెంట్ పెట్టాడని వాపోయారు. ”ఏందే నీ గోల. నీ లాంటి వాళ్లు ఉంటే ఇలానే చంపేస్తారు” అని ఆ వ్యక్తి కామెంట్ పెట్టాడని మాధవీలత వెల్లడించారు. దానికి తాను చాలా ఘాటుగానే బదులు ఇచ్చాను అన్నారు. ” రేపిస్టులు అంటే అలానో ఇలానో ఉంటారు అని టీవీలో చూశాను, పేపరల్లో చదివాను.. కానీ రేపిస్టులు అంటే నీలా ఉంటారు అని ఫస్ట్ టైమ్ నా ఫేస్ బుక్ లో చూశాను.. నీ సంస్కారం ఏంటో, నీ తల్లిదండ్రులు నిన్ను ఎంత గొప్పగా పెంచారో.. నీ కామెంట్ చూస్తేనే అర్థమవుతుంది” అని ఆ వ్యక్తికి రిప్లయ్ ఇచ్చినట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తుల కారణంగానే ఆడవారికి రక్షణ లేకుండా పోయిందన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!