HomeTelugu Trendingతారక్ అభిమానులపై మీరాచోప్రా మండిపాటు

తారక్ అభిమానులపై మీరాచోప్రా మండిపాటు

10 1

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బంగారం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మీరా చోప్రా. ఆ తర్వాత వాన, గ్రీకువీరుడు, మారో వంటి చిత్రాల్లో నటించింది. కొద్దిరోజులుగా తెలుగు తెరకు దూరంగా ఉంటున్న మీరాచోప్రా తాజాగా ట్విట్టర్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా మీకు ఇష్టమైన హీరో ఎవరు అన్న నెటిజన్ ప్రశ్నకు మహేష్‌బాబు అని సమాధానమిచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గురించి మరో నెటిజన్ అడగ్గా.. తాను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదని చెప్పినందుకు తనను తీవ్ర పదాలతో దూషిస్తున్నారని ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘తారక్… నీ అభిమానులు నన్ను వేశ్య, పోర్న్‌ స్టార్‌​ వంటి పదాలతో పిలుస్తారని అనుకోలేదు. కేవలం నీ కంటే మహేశ్ బాబునే ఎక్కువగా ఇష్టపడతానని నేను చెప్పడంతో ఇది జరిగింది. నీ అభిమానులు నా తల్లిదండ్రులకు కూడా ఇలాంటి అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారు. ఇటువంటి అభిమానులతో మీరు సక్సెస్ సాధించినట్టు భావిస్తున్నారా?. ఈ విషయంపై స్పందిస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!