HomeTelugu Trendingపెళ్లికి రెడీ అవుతున్న నయనతార!

పెళ్లికి రెడీ అవుతున్న నయనతార!

4 25నయనతార సౌత్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది. శ్రీరామ రాజ్యం సినిమాకు ముందు నయనతార కేవలం గ్లామర్ హీరోయిన్. ఎక్కువ గ్లామర్ సినిమాలు చేసింది. ఆ తరువాత ప్రభుదేవాతో ఎఫైర్ నడిచింది. ప్రభుదేవాను వివాహం చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, కొన్ని కారణాల వలన ప్రభుదేవాతో వివాహం క్యాన్సిల్ కావడమే కాదు. ఇద్దరు విడిపోయారు కూడా.

ఆ తరువాత నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి ఉంటున్న సంగతి అందరికి తెలుసు. కానీ, నయనతార పర్సనల్ విషయాలను ఎవరు టచ్ చేసే ధైర్యం చేయరు. కాగా, త్వరలోనే విఘ్నేష్ శివన్.. నయనతార వివాహం జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. విఘ్నేష్ శివన్ ఇంట్లో పెళ్లి చేసుకోవాలని తొందరపెడుతున్నారని .. వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లో నయన్.. విఘ్నేష్ ల వివాహం జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!