తన సీక్రెట్‌ బయటపెట్టిన హాట్‌ బ్యూటీ

టాలీవుడ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో అడుగుపెట్టిన పాయల్ రాజపుత్ ఆ సినిమా సూపర్ హిట్ తరువాత వరసగా మూడు సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో వెంకిమామ, ఆర్డిఎక్స్ లవ్, డిస్కోరాజా సినిమాల్లో నటించే అవకాశం కొట్టేసింది. కాగా, ఈ మూడు సినిమాలు వరసగా విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 11 న ఆర్డిఎక్స్ లవ్, దీపావళికి వెంకిమామ, అలానే డిసెంబర్ లో డిస్కోరాజా రిలీజ్ కాబోతున్నది. వీటితో పాటు పాయల్ తమిళంలో కూడా సినిమా చేస్తున్నది. అక్టోబర్ 11 వ తేదీన విడుదల కాబోయే సినిమాను బట్టి పాయల్ కు అవకాశాలు వస్తాయి.

ఇదిలా ఉంటె, పాయల్ రాజ్ పుత్ తన ఫిట్నెస్ గురించిన కొన్ని విషయాలను బయటపెటింది. ఈ భామ ఉదయం లేచిన వెంటనే గ్రీన్ లేదా లెమన్ వాటర్ తీసుకుంటుందట. ఇవి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయని చెప్తోంది. ఆ తరువాత లైట్ గా జిమ్ చేస్తుంది. అనంతరం పవర్ యోగా చేస్తుందట. మామూలు యోగా చేయడం కంటే పవర్ యోగా చేయడం వలన శరీరం మరింత శక్తివంతంగా మారుతుందని ఫిట్నెస్ గా ఉండేందుకు పవర్ యోగా సహకరిస్తోందని అంటోంది పాయల్. వంట చేయడం అంటే బాగా ఇష్టం అని, చికెన్ అంటే ఇష్టం ఉన్నాగ్లామర్ ప్రపంచంలో ఉన్న కారణంగా శాకాహారిగా మారిపోయానని చెప్తోంది. స్క్రిప్ట్ నచ్చితే ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పింది ఈ హాట్‌ బ్యూటీ.