HomeTelugu Trendingవేశ్య పాత్రలో అల్లు అర్జున్‌ హీరోయిన్‌..

వేశ్య పాత్రలో అల్లు అర్జున్‌ హీరోయిన్‌..

3 5
స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య 2’ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా మంచి విజయం సాధించింది. ఆర్య సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్దా దాస్ కీలక పాత్రలో నటించింది.

ఆ సినిమా హిట్టైన పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న శ్రద్దా దాస్ ఇప్పుడు ఓ ప్రయోగాత్మకమైన సినిమాలో నటిస్తుండటం విశేషం. ఈ ప్రయోగాత్మకమైన సినిమాలో శ్రద్దా దాస్ వేశ్యగా నటిస్తోందని తెలుస్తోంది. ఇందులో జగపతిబాబు హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుందట. మరి
ఎలా ఉంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu