శివాజీ రాజాపై విరుచుకుపడ్డ నటి!

నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన శివాజీ రాజాపై సీనియర్ నటి తులసి కొన్ని విమర్శలు చేశారు. శివాజీరాజా ఒక జోకర్ అంటూ కామెంట్స్ చేశారు. తన సోషల్ మీడియా వేదికగా ఆమె ఇటువంటి విమర్శలు చేశారు. మరి అంతగా ఆమె శివాజీరాజాను దూషించడానికి కారణం ఏంటి.. అనుకుంటున్నారా..? దీని వెనుక ఆసక్తికరమైన కథే ఉంది. ఈ మధ్య నటి తులసి ‘శంకరాభరణం’ అవార్డ్స్ పేరిట తెలుగు సినిమా వాళ్ళకు అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని ఆమె ప్లాన్ చేసుకున్నారు. 
దానికోసం సినిమా ఇండస్ట్రీ నుండి అనేక మంది ప్రముఖులకు, నేటి యువ హీరోలను పత్యేకంగా ఆహ్వానించారు. అయితే వారెవరూ కార్యక్రమానికి హాజరు కాకపోవడం, తులసి ఆశించినట్లుగా అవార్డ్ ఫంక్షన్ జరగకపోవడంతో ఆమె ఆవేదన చెందారు. దీనంతటికీ కారణం మా అధ్యక్షుడు శివాజీరాజా అనేది ఆమె ఆరోపణ. శివాజీతో పాటు పీఆర్వో అయిన సురేష్ కొండేటిపై కూడా ద్వజమెత్తారు. తను ఏర్పాటు చేసిన అవార్డ్ ఫంక్షన్ కు సినిమా వాళ్ళు రాకపోవడానికి వీరిద్దరే కారణమని అన్నారు.