లిప్ లాక్ లో వింత ఏముంది!

హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదా శర్మ తెలుగులో నాలుగైదు సినిమాల్లో మెరిసింది. కానీ నటిగా ఆదాకు సరైన గుర్తింపు లభించలేదు. అయితే తాజాగా బాలీవుడ్ లో కమెండో2 సినిమాలో అవకాశం దక్కించుకొని నటించేసింది. ప్రస్తుతం ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై ఆదా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా కోసం రిస్క్ తీసుకొని యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. విధ్యుత్ జమ్ వాల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా ట్రైలర్ చూసి విధ్యుత్ తెగ పొగిడేశాడు.
అయితే ఈ సినిమాలో ఎన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయో.. అంతే రొమాన్స్ కూడా ఉంటుందట. సినిమాలో విధ్యుత్ కు, ఆదాకు మధ్య లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ విషయమై ఆదాను ప్రశ్నించగా.. సినిమా అన్నాక అన్నీ ఉండాలి.. అయినా లిప్ లాక్ లో వింత ఏముంది.. ఇప్పుడు అది చాలా కామన్ అయిపోయింది అంటూ చాలా లైట్ గా చెప్పేసిందీ బ్యూటీ. మరి లిప్ లాక్ లు, యాక్షన్ సన్నివేశాలు ఇలా ఆదా పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందేమో.. చూడాలి!