‘అదుగో’ పందిపిల్ల టీజర్‌

నటుడు రవిబాబు విభిన్న చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని మెప్పించే. మరో వినూత్న కథతో తానే దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం ‘అదుగో’. ఈ చిత్రాని సురేశ్‌ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో పందిపిల్ల ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇందులో ‘బంటి’ పాత్రలో సందడి చేయనున్న పందిపిల్లను పరిచయం చేశారు. ఓ బాలుడు చెప్పింది ‘బంటి’ చేస్తూ కనిపించింది. ఈ ప్రచార చిత్రం చాలా ప్రత్యేకంగా ఉంది. ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు.

ఈ టీజర్‌లో ఏ బంటి.. ఎక్కడున్నావ్‌. ఏ దొంగ నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు. రా బయటికి.. బంటి ఈజ్‌ ఎ గుడ్‌ బాయ్‌. కమ్‌.., డౌన్‌.. డౌన్‌.., రోల్‌.. రోల్‌.., స్టాండప్‌.. గుడ్‌. నేను సాంగ్‌ పెడుతా నువ్వు డ్యాన్స్‌ చెయ్యి.. ఏంటి ఆ పిచ్చి డ్యాన్స్‌.. మళ్లీ ప్లే చేస్తా.. మళ్లీ చేయ్యి’ అంటూ పందిపిల్లతో బాబు మాట్లాడుతున్నట్లు చూపించారు.

ఈ సినిమాను భారతదేశ అన్ని భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు దర్శక, నిర్మాతలు ప్రకటించారు. దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్‌ను చూపిస్తోన్న సినిమా ఇదని పేర్కొన్నారు. ఈ చిత్రం.. మిగిలిన అన్ని భాష‌లోనూ.. ‘బంటి’ పేరుతో విడుద‌ల కాబోతోందని అన్నారు.