HomeTelugu Trending'ఆదిపురుష్‌' అప్‌డేట్‌

‘ఆదిపురుష్‌’ అప్‌డేట్‌

Adipurush Motion Capture
యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం పలు సినిమాల్లో బీజీగా ఉన్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ పనులను కూడా మొదలుపెట్టేశాడు. ప్రభాస్ లేనటువంటి సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం అతను ఈ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. దీంతో అతి త్వరలో ఆదిపురుష్ చిత్రీకరణను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆదిపురుష్ టీం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం నేడు ఉదయం మరో ప్రకటన చేశారు. ఇందులో డైరెక్టర్‌ ఓంరౌత్‌తో పాటు వీఎఫెక్ట్స్ టీమ్‌ మొత్తం చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేశారు. ఆదిపురుష్ ప్రపంచాన్ని చూపించడానికి మోషన్ వర్క్ ప్రారంభమైందని అందులో పేర్కొన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక త్వరలో ప్రభాస్ ఈచిత్రంలో ఎలా కనిపిస్తాడన్న దానిపై ఫుల్‌ క్లారిటీ వస్తుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu