HomeTelugu Trending'ఆదిపురుష్‌'లో సీతగా అనుష్క!

‘ఆదిపురుష్‌’లో సీతగా అనుష్క!

Anushka sharma as sita in A 1
టాలీవుడ్ యంగ్‌ హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ డైరెక్టుగా నటిస్తున్న హిందీ చిత్రం ‘ఆదిపురుష్’ . ఈ సినిమాకు సంబంధించన వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రామాయణం ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా నటిస్తున్నారు. అయితే, సీత పాత్ర విషయంలోనే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మొదట్లో కీర్తి సురేశ్ .. తర్వాత కియారా అద్వానీ.. ఆ తర్వాత ఊర్వశి రౌటేలా.. వంటి పేర్లు వినిపించగా, తాజాగా మరో బాలీవుడ్‌ బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది.

ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అనుష్క శర్మ దాదాపు ఖరారైందని బాలీవుడ్ మీడియా కూడా వార్తలు ఇస్తోంది. అనుష్కను ఇటీవల దర్శకుడు ఓం రౌత్ కలసి కథ, ఆమె పాత్ర గురించి వివరించి చెప్పాడని, ఆమె కూడా సంతోషంగా ఒప్పుకుందని అంటున్నారు. కాగా ప్రస్తుతం అనుష్క ప్రెగ్నెంట్ కదా? ఆమె ఎలా ఒప్పుకుని వుంటుంది? అన్న డౌట్ కూడా ఉంది. అది నిజమే.. అనుష్కకు జనవరిలో డెలివరీ అవుతుంది. ఈ విషయాన్ని కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. ఇక ‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ కూడా జనవరిలోనే మొదలవుతుంది. ముందుగా ప్రభాస్, ఇతర తారాగణంపై సన్నివేశాల భాగాన్ని పూర్తిచేస్తారట. డెలివరీ అయిన రెండు నెలల తర్వాత తాను షూటింగుకి రెడీ అయిపోతానని అనుష్క చెప్పిందట. సో.. ఆ ప్రకారం ఆమె షూటింగును ప్లాన్ చేస్తారని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu