HomeTelugu NewsChiranjeevi: మూడు దశాబ్దాల తరువాత సూపర్ హిట్ హీరోయిన్ తో మెగాస్టార్

Chiranjeevi: మూడు దశాబ్దాల తరువాత సూపర్ హిట్ హీరోయిన్ తో మెగాస్టార్

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి, సురభి వంటి భామలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్‌ యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర కూడా నటిస్తున్నట్టు సమాచారం. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీగా దీన్ని తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.

కాగా ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్‌ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్‌. ఓ ముఖ్యమైన పాత్రకి ఆమెని అడుగుతున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మరి విజయశాంతి ఓకే చెబుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అనేక బ్లాక్‌ బస్టర్స్ వచ్చాయి.

దాదాపు వీరి కాంబినేషన్‌లో 20కి పైగా సినిమాలు వచ్చాయి. ఓ టైమ్‌ తర్వాత విజయశాంతి.. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు షిఫ్ట్ అయ్యింది. దీంతో పెద్ద హీరోల సరసన సినిమాలు చేయలేదు. ఆ తర్వాత సినిమాలకే దూరమైన విజయశాంతి.. రాజకీయాల్లో బిజీ అయిపోయింది. చాలా ఏళ్ల తర్వాత ఆ మధ్య మహేష్‌ బాబు `సరిలేరు నీకెవ్వరు` సినిమాలో కీలక పాత్రలో నటించింది.

chiranjeevi 1 Chiranjeevi,Vijayashanti,Vishwambhara,Trisha,Sarileru Neekevvaru

దీంతో మళ్లీ ఆమె సినిమాల్లో కనిపిస్తుంది అని భావించారు. అయితే అలా జరగలేదు. ఈక్రమంలో మరోసారి ఆమె మేకప్‌ వేసుకోబోతుందట. అది చిరంజీవి కోసమని తెలుస్తుంది. చిరంజీవితో కలిసి నటించబోతుందట. దాదాపు 30ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు జోడీ కట్టబోతున్నట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే చిరంజీవి, విజయశాంతి టాలీవుడ్‌లో హిట్‌ పెయిర్‌గా నిలిచింది. అంతేకాదు డాన్సుల్లోనూ ఈ ఇద్దరిని కొట్టేవాళ్లే లేరంటారు. ఇద్దరు కలిసి డాన్సు చేస్తే కనువిందులా ఉంటుందనే టాక్‌ ఉంది. ఇక చిరంజీవి, విజయశాంతి కలిసి `పసివాడి ప్రాణం`, `స్వయంకృషి`, `అత్తకు యముడు అమ్మాయికి మొగుడు`, `కొండవీటి రాజా`, `గ్యాంగ్ లీడర్‌`, `కొండవీటి దొంగ`,

`స్టూవర్ట్ పురం పోలీస్‌ స్టేషన్‌`, `రుద్రవీణ`, `యముడికి మొగుడు`, `సంఘర్షణ`, `మహనగరంలో మాయగాడు`, `దేవాంతకుడు`, `యుద్ధభూమి`, `చణక్య శపథం`, `ధైర్యవంతుడు`, `మంచిదొంగ`, `ఛాలెంజ్‌`, `చిరంజీవి`, `మెకానిక్ అల్లుడు` వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరు తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!