అఖిల్ కెలుకుడు షురూ!

అక్కినేని అఖిల్ ‘అఖిల్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అఖిల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. నిజానికి ఈ సినిమా కథ సరిగ్గా లేదని అందరూ భావించినప్పటికీ అఖిల్ మాత్రం అదే కథ కావాలని పట్టుబట్టి మరీ చేశాడు. పైగా స్టార్ డైరెక్టర్ వినాయక్ కు స్వేచ్చ ఇవ్వకుండా.. చాలా విషయాల్లో అఖిల్ ఇన్వాల్వ్ అయ్యాడని అంటారు.
 
ఇక సినిమా రిజల్ట్ సంగతి తెలిసిందే కదా.. దీని తరువాత రెండో సినిమా సెట్ చేయడానికి కొంత గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. ‘మనం’ సినిమాను తెరకెక్కించిన విక్రమ్ కుమార్ చెప్పిన కథతో సినిమా చేస్తున్నారు. అయితే ఇప్పుడు విక్రమ్ పై అన్ని బాధ్యతలు వదిలేయకుండా.. మళ్ళీ అఖిల్ జోక్యం చేసుకుంటున్నాడని టాక్. పాటలు, ఫైట్స్ ఇలా చాలా వరకు అఖిల్ సలహాలు ఇస్తున్నాడని సమాచారం.
 
అయితే విక్రమ్ ఒక ఫార్మాట్ లో తన స్టయిల్ లో వర్క్ చేస్తాడు. దీంతో అఖిల్ జోక్యం తనకు నచ్చడం లేదని తెలుస్తోంది. ఈ విషయంపై నాగార్జునకు కూడా కంప్లైంట్ చేశాడట విక్రమ్. డిసంబర్ 22న ఈ సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించడంతో దానికి తగ్గట్లుగా వేగంగా షూటింగ్ పూర్తి చేద్దామని అనుకుంటే.. అఖిల్ ఇన్వాల్వ్మెంట్ మరింత ఆలస్యమయ్యేలా చేస్తుందని టాక్.
 
ఈ కారణంగా సినిమా అవుట్ పుట్ మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అఖిల్ తన పని తాను చేసుకుంటూ పోతే మంచిదని భావిస్తున్నారు. ఇదే గనుక రిపీట్ చేస్తే ఇక ఆయనతో కలిసి పని చేయడానికి దర్శకులు వెనుకడుగు వేయడం ఖాయం.