ఫోని తుఫాను బాధితులకు అక్షయ్ భారీ విరాళం !

ఫోని తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఒడిశాకు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ భారీ విరాళం అందించారు. దాదాపు కోటి రూపాయాలను ఆయన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సహాయనిధికి పంపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి అక్షయ్‌ ఎల్లప్పుడూ ముందుంటారు. గతంలో కేరళ, చెన్నైలో తుపాను బీభత్సం సృష్టించినప్పుడు కూడా అక్షయ్‌ తనవంతు సాయం చేశారు. అంతేకాదు ‘భారత్ కే వీర్‌’ వెబ్‌సైట్‌ ద్వారా జవాను కుటుంబాలను కూడా ఆదుకుంటున్నారు.
ఫొని తుఫాను కారణంగా ఒడిశాలో సుమారు 34 మంది మృతి చెందగా, కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తుపాను వల్ల దెబ్బతిన్న ఒడిశాకు ఇతర రాష్ట్రాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలూ బాసటగా నిలుస్తున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates