HomeTelugu Trendingబిగ్‌బాస్‌లో రీఎంట్రీ..!

బిగ్‌బాస్‌లో రీఎంట్రీ..!

3 25తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-3 15 మంది కంటెస్టెంట్లతో గ్రాండ్‌గా ప్రారంభం అయింది. తర్వాత వీరికి తోడుగా వచ్చిన రెండు వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలతో ఇంటిసభ్యుల సంఖ్య 17కు చేరుకుంది. అయితే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా, శిల్ప చక్రవర్తిలు సరైన ప్రేక్షకాదరణ లేక త్వరగానే బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటకు వచ్చేశారు. ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య 9కు చేరుకుంది. ఇప్పుడిప్పుడే పోటీ తీవ్రతరమయ్యే సమయంలో మళ్లీ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ తీసుకురావటం అనేది బిగ్‌బాస్‌ టీమ్‌కు కత్తి మీద సామే. అందుకని రూటు మార్చిన బిగ్‌బాస్‌ టీం ఎలిమినేట్‌ అయిన సభ్యుల్లోంచి ఒకరికి రీఎంట్రీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటివరకు హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణి, అషూరెడ్డి, అలీ రెజా, శిల్ప చక్రవర్తి, హిమజలు ఎలిమినేట్‌ అయ్యారు. అయితే రీఎంట్రీ చాన్స్‌ మాత్రం అలీకే ఎక్కువగా ఉన్నాయి.

కాగా నేటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్‌ పెద్దట్విస్ట్‌ ఇవ్వనున్నాడు. మొదట వైల్డ్‌కార్డ్‌ అయి ఉంటుందని భావించిన ఇంటిసభ్యులకు షాక్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి అందరికీ తెలిసిన వ్యక్తి రాబోతున్నాడు. బిగ్‌బాస్‌ ఇచ్చే ఏ టాస్క్‌ అయినా.. దానికి పూర్తి న్యాయం చేసే వ్యక్తిగా, మోస్ట్‌ అగ్రెసివ్‌గా పేరు తెచ్చుకున్న స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అలీ రెజాను బిగ్‌బాస్‌ ఇంట్లోకి పంపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఎలిమినేషన్‌ జోన్‌లోకి వెళ్లిన మొదటి సారే అలీ ఎలిమినేట్‌ అవడం అందర్నీ షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. దీంతో అతని అభిమానులు అలీ లేకుండా షో చూడటం వేస్ట్‌ అని బిగ్‌బాస్‌ నిర్వాహకులపై ఫైర్‌ అయ్యారు. తాజాగా అలీ రాక రీఎంట్రీగా మారితే మాత్రం అతని అభిమానులకు ఇక పండగే. ఇక నేటి ఎపిసోడ్‌లో గ్రాండ్‌ ఎంట్రీతో అలీ అదరగొట్టనున్నట్టు కనిపిస్తోంది. అయతే అది అలీది రీఎంట్రీనా లేక జస్ట్‌ ఎంట్రీనా అన్న సందిగ్ధానికి నేటి ఎపిసోడ్‌లో తెరపడనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!