మోక్షజ్ఞకు సినిమాల మీద ఆసక్తి లేదా..?

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞను సినిమాల్లోకి తీసుకురావాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలయ్య తన కుమారుడి మొదటి సినిమా ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, బోయపాటి వంటి వారితో చేయాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు వారంతా ఫుల్ బిజీ.. ఈ కారణంగానే మోక్షజ్ఞ తెరంగేట్రం ఆలస్యం అవుతుందని అనుకుంటున్నారు.
 
ఈ సినిమాను తనే నిర్మిస్తానని నిర్మాత సాయి కొర్రపాటి ముందుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞకు సినిమాల మీద ఆసక్తి లేదట. తనకు సినిమాల కంటే వ్యాపారం మీదే మక్కువ ఎక్కువ అని తెలుస్తోంది. సొంతంగా బిజినెస్ మొదలుపెట్టి వ్యాపారవేత్తగా వెలుగొందాలనేది మోక్షు ఆలోచన అని తెలుస్తోంది. మరి మోక్షజ్ఞ తన ఆలోచనలను బిజినెస్ నుండి సినిమాల్లోకి షిఫ్ట్ చేస్తాడేమో చూడాలి!!