సూపర్‌స్టార్‌ ‘పేట’ ట్రైలర్‌..

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటించిన చిత్రం ‘పేట’ ట్రైలర్‌ వచ్చేసింది. కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో త్రిష, సిమ్రన్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ ట్రైలర్‌లో రజనీ స్టైల్‌, లుక్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ఇందులో విజయ్‌ సేతుపతి విలన్‌ పాత్రలో కన్పించనున్నారు. పోరాట సన్నివేశాల్లో రజనీ స్టైల్‌ ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖి కీలక పాత్రలో నటించారు. ట్రైలర్‌ చివర్లో రజనీ స్టెప్పులేసుకుంటూ రావడం ఆకట్టుకుంటోంది.

ఇందులో మేఘా ఆకాశ్‌, బాబీ సింహా, శశి కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటీవల విడుదలైన సినిమా పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘మరణ మాస్‌…’ పాట అభిమానులను బాగా ఆకట్టుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో తలైవా ఖైదీగా కన్పించనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు.