HomeTelugu Big Storiesఇంటికి వచ్చేస్తున్న అభిమానులు.. శ్రీముఖి విన్నపం

ఇంటికి వచ్చేస్తున్న అభిమానులు.. శ్రీముఖి విన్నపం

13 5
యాంకర్‌ శ్రీముఖి తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బిగ్ బాస్ తర్వాత మరింత ఫేమస్ అయిపోయింది ఈ బ్యూటీకి ఆ షో అయిన తర్వాత అభిమానులు కూడా బాగానే పెరిగిపోయారు. ఇప్పుడు ఈమెకు ఇదే తలనొప్పులు తెచ్చిపెడుతుంది. కొందరు అభిమానులు ఫోటోల కోసం ఇంటి వద్దే గంటల తరబడి వేచి చూస్తున్నారని.. అది చూసి తనకు బాధేస్తుందని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. అంతమందితో ఫోటోలు దిగాలని కోరినపుడు అనుకోకుండా కొన్ని సార్లు కోపం వస్తుంది.. అర్థం చేసుకోవాలి కదా మీరే.. జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నాననంటూ ఓ మెసేజ్ ఫ్యాన్స్ కోసం రాసుకొచ్చింది హాట్‌ బ్యూటీ.

అభిమానులందరీ.. ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నానని తన విన్నపాన్ని రాసుకోవడం మొదలుపెట్టింది. లైవ్‌కు వస్తున్నామని ముందు చెప్పి రాలేము కదా.. చాలా మంది ఈ సమయానికి లైవ్‌కు వస్తామని ముందే చెప్తారు.. అప్పుడు వాళ్లతో అనుకున్నట్లుగా మాట్లాడే వీలుంటుంది.. కావాల్సినంత సేపు సరదాగా మాట్లాడుకోవచ్చు కూడా.. కానీ అలాంటి లైవ్‌ కాదని చెప్పుకొచ్చింది ఈమె. శ్రీముఖి తాను ‘బిగ్‌బాస్‌’ షో నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఈ షోలో ఉన్నపుడు తనను చాలా మంది ‘మీరంటే ఇష్టం.. హౌస్‌లో మీ పెర్ఫామెన్స్‌, మీ తీరు నచ్చింది. మిమ్మల్ని కలవాలి. ఫొటోలు దిగాలి’ అంటుంటే బాగుంటుందని.. ఆ ఫీల్ అనుభవించడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పింది శ్రీముఖి.

13a

బిగ్‌బాస్‌ నుంచి వచ్చిన తర్వాత తాను ఎక్కడ ఉంటున్నానో స్నేహితుల నుంచి సమాచారం తీసుకుని నేరుగా అక్కడికి వచ్చేస్తున్నారని.. ఎలాంటి సమయం సందర్భం చూసుకోకుండా వస్తే వాళ్లను ఎలా కలుసుకోవడం అంటూ ప్రశ్నిస్తుంది ఈమె. నిజంగా అంత ప్రేమ అభిమానం ఉండటం తన అదృష్టమే అయినా కూడా ఇలా సడన్‌గా వస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు కదా అంటుంది ఈమె. మీ లాంటి అభిమానుల కోసమే కదా మేము మేకప్‌లు వేసుకుని టీవీ ముందుకు వచ్చేది అంటుంది భామ. కానీ ప్రతీ వ్యక్తికి ప్రైవసీ ఉంటుందనే విషయాన్ని అభిమానులు కూడా గుర్తుంచుకోవాలి కదా అని విన్నవించుకుంటుంది.

ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఫోటోలు దిగుతాం అన్నపుడు సంతోషంగానే ఉంది కానీ అందరికీ ఒకేసారి టైమ్ కేటాయించలేకపోవడం మాత్రం బాధగా ఉందని చెబుతుంది. ప్రస్తుతం ఒక షో చేస్తున్నానని.. ఒకేసారి మూడు ఎపిసోడ్‌లు పూర్తయ్యేసరికి రాత్రి 3 గంటలు అవుతుందని.. మళ్లీ ఉదయాన్నే నిద్రలేచి షూటింగ్‌కు వచ్చేసానని.. అసలు తీరిక ఉండటం లేదని చెబుతుంది. చాలా ఒత్తిడిగా ఉండే తమతో వచ్చి వెంటనే ఫోటోలు కావాలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి అంటూ అభిమానులను అభ్యర్థిస్తుంది. మీరు కూడా కాస్త అర్థం చేసుకోవాలి కదా.. సమయం దొరికినపుడు కచ్చితంగా ఫోటోలు దిగుదాం.. మాట్లాడుకుందామని చెబుతుంది ఈ హాట్‌ యాంకర్ శ్రీముఖి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu