‘సాహో’లో మరో బ్యూటీ!

బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ నటిస్తోన్న నూతన చిత్రం ‘సాహో’. ఈ సినిమాపై అన్ని పరిశ్రమల ప్రేక్షకుల దృష్టి పడింది. ఆ అంచనాలను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు గుర్తింపు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షించడానికి సినిమాలో ఎక్కువగా బాలీవుడ్ తారాగణాన్ని
ఎంపిక చేసుకుంటున్నారు. ఇప్పటికే శ్రద్ధాకపూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఇప్పుడు మరో నటిని కూడా రంగంలోకి దింపుతున్నారు.

బాలీవుడ్ నటి మందిరా బేడీను సినిమాలో నెగెటివ్ రోల్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన చిత్రబృందం నుండి ఎటువంటి అధికార ప్రకటన కూడా రాలేదు. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్ వంటి తారలు కనిపించనున్నారు.