HomeTelugu Trendingయాంకర్‌ 'సుమ' మూవీ ప్రకటన

యాంకర్‌ ‘సుమ’ మూవీ ప్రకటన

Anchor suma kanakala movie

తెలుగు స్టార్‌ యాంకర్‌ సుమ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై సుమ కూడా ఇంతమంది అడుగుతున్నారంటే చేస్తే పోలే.. అని క్లూ వదిలింది.

తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది సుమ. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్టర్‌ వదిలింది. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు వెల్లడించింది. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ నవంబర్‌ ఆరున రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ పోస్టర్‌లో బియ్యం దంచడానికి సుమ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కానీ ఆమె ముఖం మాత్రం కనిపించలేదు. ఆమె చేతిపై వెంకన్న అనే పేరు పచ్చబొట్టు వేయించుకున్నట్లుగా చూపించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియలాంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!