HomeTelugu Trendingపోతావురరేయ్.. పోతావ్.. రోడ్లపై తిరుగుతున్నవారిపై సుమ ఫైర్‌

పోతావురరేయ్.. పోతావ్.. రోడ్లపై తిరుగుతున్నవారిపై సుమ ఫైర్‌

3 23
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృభిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దీని వ్యాప్తి ఆగడం లేదు. ఇప్పటి వరకు దేశంలో 446 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, 9మంది మరణించారని కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 99 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తుంది. ప్రజలు ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అయినా కూడా కొందరు ప్రభుత్వాల మాటలను లెక్కచేయడం లేదు. అవసరం లేకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రజలకు పోలీసులు లాఠీలతో బుద్ధి చెప్తున్నారు. అటువంటి వారిని ఉద్దేశించి యాంకర్ సుమ ఓ వీడియోను పోస్ట్ చేసారు. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు.

కొంతమంది మాత్రం బాధ్యతారాహిత్యంగా రోడ్లపై తిరుగుతున్నారు. రోడ్ల మీద తిరగడానికి మీకు అంత అవసరం ఏమున్నది? ప్రజలు బయట తిరగడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తమవుతుంటే.. మీరు రోడ్లపైకి రావడం కరెక్ట్‌ కాదు అని యాంకర్ సుమ తన వీడియోలో సూచించారు. ఏ మంత అర్జెంట్ పని.. రోడ్ల మీదకు వెళ్ళడానికి.. పోతావురరేయ్.. పోతావ్.. అని చెబుతునే ఉన్నారా.. గవర్నమెంట్ అఫీషియల్స్, హెల్త్ వర్కర్స్, కమ్యూనిటీ వర్కర్స్, డాక్టర్లు, నర్సులు, పోలీసు, మీడియా వీళ్లంతా వాళ్ల ప్రాణాల్ని రిస్కులో పెట్టి వర్క్ చేస్తున్నారు. ఇలాంటి పనులలో లేని వాళ్లు ఇళ్లకి పరిమితం అవొచ్చుకదా.. అలాగే ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చి గుట్టు చప్పుడు కాకుండా వాళ్లని వాళ్లు డిక్లేర్ చేసుకోకుండా ఇళ్ళకి పరిమితమైన వాళ్లు ఇప్పటికైనా మీ గురించి చెప్పినట్లు అయితే … అది మీరు మన భారతదేశానికి చేసే చాలా పెద్ద ఉపకారం అవుతుంది. అని చెప్పింది సుమ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!