కొలువుదీరిన జగన్ మంత్రివర్గం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘టీమ్ 25’ ప్రమాణస్వీకారం చేసింది. అమరావతిలోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు, అధికారులు, నేతలు హాజరయ్యారు. వరుసగా మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌కు సీఎం వైఎస్ జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారు.. ధర్మాన కృష్ణదాస్‌, నరసన్నపేట నియోజకవర్గం (శ్రీకాకుళం), బొత్స సత్యనారాయణ, చీపురుపల్లి నియోజకవర్గం (విజయనగరం), పాముల పుష్ప శ్రీవాణి, కురుపాం నియోజకవర్గం, ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్), భీమిలి నియోజకవర్గం (విశాఖపట్నం), పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మండపేట నియోజకవర్గం (తూర్పుగోదావరి), పినిపె విశ్వరూప్‌, అమలాపురం నియోజకవర్గం, కురసాల కన్నబాబు, కాకినాడ రూరల్‌ నియోజకవర్గం, తానేటి వనిత, కొవ్వూరు నియోజకవర్గం (పశ్చిమగోదావరి), చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆచంట నియోజకవర్గం, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), ఏలూరు నియోజకవర్గం,

కొడాలి నాని, గుడివాడ నియోజకవర్గం (కృష్ణా జిల్లా), వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, పేర్ని వెంకట్రామయ్య (నాని), మచిలీపట్నం నియోజకవర్గం, మేకతోటి సుచరిత, ప్రత్తిపాడు నియోజకవర్గం (గుంటూరు), మోపిదేవి వెంకటరమణ, రేపల్లె నియోజకవర్గం, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు నియోజకవర్గం (ప్రకాశం జిల్లా), ఆదిమూలపు సురేష్‌, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గం (నెల్లూరు), అనిల్‌కుమార్‌ యాదవ్‌, నెల్లూరు సిటీ నియోజకవర్గం, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డోన్ నియోజకవర్గం (కర్నూలు), గుమ్మనూరు జయరాం, ఆలూరు నియోజకవర్గం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గం (చిత్తూరు), కె.నారాయణస్వామి గంగాధర నెల్లూరు నియోజకవర్గం, అంజద్‌ బాషా, కడప నియోజకవర్గం (కడప జిల్లా), యం. శంకరనారాయణ, పెనుకొండ నియోజకవర్గం (అనంతపురం).