‘ఆర్‌ఆర్‌ఆర్’ పై అప్‌డేట్ ఇచ్చిన కీరవాణీ

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(వర్కింగ్‌ టైటిల్‌). మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీ స్టారర్‌ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు కేవలం వర్కింగ్ టైటిల్‌ మాత్రమే ప్రకటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ టీం అంతకు మించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కనీసం హీరోయిన్ల పేర్లను కూడా ప్రకటించలేదు.

తాజాగా ఈసినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణీ సోషల్ మీడియా ద్వారా బయట పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌లోని ఓ పాటకు సుద్ధాల అశోక్‌ తేజ సాహిత్య అందిస్తున్నట్టుగా వెల్లడించారు కీరవాణి. పోరాట స్ఫూర్తిని రగిల్చే పాటలు రాయటంలో అశోఖ్‌ తేజకు మంచి పేరుంది. గతంలో చిరంజీవి ఠాగూర్‌ సినిమా కోసం రాసిన నేను సైతం కూడా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు అశోక్‌ తేజ.