‘అరవింద సమేత’ నుంచి మరో ప్రోమో!

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ ఫుల్ పాజిటివ్ బజ్ నడుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్, ట్రైలర్ అన్ని సూపర్ హిట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా హిట్ కావడంతో.. సినిమా విడుదల కావడమే ఆలస్యం సూపర్‌ హిట్ అవ్వడమే అంటున్నారు ఫ్యాన్స్.

ఫ్యాన్స్ కోసం ఈ సినిమా నుంచి రోజుకో అప్డేట్ ఇస్తున్నారు. నిన్న ‘అనగనగా’ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన అరవింద సమేత.. రేపు పెనివిటి సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయబోతున్నది. రేపు సాయంత్రం 4:50 గంటలకు సాంగ్ ప్రోమోను యూనిట్ రిలీజ్ చేస్తున్నది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబరు 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.