బీహార్‌లో స్టార్ట్‌ చేసిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించిన బాలకృష్ణ ఇప్పుడు తిరిగి సినిమాలపై దృష్టిపెట్టారు. జైసింహా వంటి హిట్ ఇచ్చిన కెఎస్ రవికుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. జూన్ 12 వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ జులై 15 నుంచి ప్రారంభం కాబోతున్నది.

ఫస్ట్ షెడ్యూల్ బీహార్ లో ప్రారంభం అవుతుందట. ఇందులో సీనియర్ హీరోయిన్ శ్రీయ నటిస్తోంది. చెన్నకేశవ రెడ్డి, పైసా వసూల్, గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఇది బాలయ్యతో ఆమెకు నాలుగో సినిమా. శ్రీయతో కలిసి సినిమా చేస్తే హిట్ అవుతుందని భావించిన బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కాబోతున్నది.