అఫీషియల్‌: గోపిచంద్ మలినేనితో బాలకృష్ణ 107వ చిత్రం


ఈ రోజు(జూన్‌ 10) బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన 107వ సినిమా పై అఫీషియల్‌ గా ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ బ్యానర్‌పై నిర్మించనుంది. ఇందుకు సంబంధించి పోస్టర్‏తో పాటు ఇంట్రడ్యూసింగ్ వీడియోను విడుదల చేశారు. ‘క్రాక్‌’ విజయం తర్వాత బాలకృష్ణ కోసం గోపీచంద్‌ మలినేని ఓ మాస్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 107వ చిత్రంలో బాలయ్య మాస్‌ లుక్‌లో సందడి చేసే అవకాశాలున్నట్లు సమాచారం.

కాగా, ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి న్యూపోస్టర్‌ విడుదలైంది. ‘అఖండ’పూర్తయిన తర్వాత గోపీచంద్‌ మలినేని ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది.

CLICK HERE!! For the aha Latest Updates