రానా వర్సెస్ బాలయ్య!

బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పైసా వసూల్‌ సెప్టెంబర్‌1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘పైసా వసూల్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య, పూరీ కలిసి రానా హోస్ట్‌గా చేస్తున్న ఓ కార్యక్రమంలో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, అందులోనే బాలకృష్ణ తన రచ్చను చూపాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 

ఈ షోలో బాలయ్య-రానా ల మధ్య ‘ఏమంటివి.. ఏమంటివి..’ అనే పాపులర్ డైలాగ్ ను ఈ ఇద్దరు హీరోలు పోటీ పడి మరీ చెప్పారట. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఎపిసోడ్స్ లో ఈ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.  అయితే రానా షోలో ఈ ఇద్దరు చేసిన సందడి చూడాలంటే మాత్రం ఆదివారం వరకు వెయిట్‌ చేయాల్సిందే.