అర్థరాత్రి ‘సైమా’లో చిందేసిన బాలయ్య..!

దుబాయ్‌లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) రెండు రోజులపాటు జరిగిన వేడుకల ముగింపు సందర్బంగా సౌత్ సినీ సెలెబ్రెటీలందరికి కూడా ‘సైమా’ నిర్వాహకులు పెద్ద పార్టీ ఇవ్వడం జరిగింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రానికి ఉత్తమ హీరో అవార్డును అందుకునేందుకు దుబాయి వెళ్లిన బాలకృష్ణ అక్కడి వారిని తన ఉత్సాహంతో సర్‌ఫ్రెజ్ చేశాడు. సైమా ఇచ్చిన ఆ పార్టీలో బాలకృష్ణ తీరును చూసి చాలామంది సెలెబ్రెటీలు ఆశ్చర్యపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆపార్టీ అర్థరాత్రి 12 గంటల నుండి తెల్లవారుఝాము వరకు కొనసాగినట్లుగా తెలుస్తోంది. సైమా నిర్వాహకులు ఇచ్చిన పార్టీలో బాలకృష్ణ చాలా జోవియల్ గా పాల్గొనడమే కాకుండా అందరితో కలిసి సరదాగా జోక్స్ వేస్తూ ఆపార్టీలో తెగ సందడి చేసినట్లు తెలుస్తోంది. కేవలం పెద్ద హీరోలతో మాత్రమే కాకుండా చిన్న నటీనటులతో యంగ్ హీరోయిన్స్ తో బాలకృష్ణ సినిమా షూటింగ్ సమయాలలో అదేవిధంగా పార్టీలలో కలిసిపోతాడు అనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి.

‘సైమా’ పార్టీలో ఎంజాయ్ చేయడమే కాకుండా బాలయ్య డాన్స్ లు కూడా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సైమా వేడుకల్లో పాల్గొన్న హీరోయిన్స్ శ్రియ, ప్రగ్యా జైస్వాల్, అంజలి లాంటి పలువురు హీరోయిన్స్ తో బాలకృష్ణ డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో బాలయ్య చేసిన హంగామా చూసి చాలామంది తమిళ కన్నడ హీరోలు ఆశ్చర్యపోయారట. అంటే బాలయ్య హడావిడి ఏరేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు.

బాలకృష్ణ తనతో నటించే హీరోయిన్స్ చేత ‘సార్’ అని పిలిపించుకోకుండా ‘బాల’ అని పిలిపించుకోవడానికి ఎంతో ఇష్టపడతారట. బాలకృష్ణ ఆరు పదుల వయసుకు దగ్గరవుతున్నా మేకప్ వేసుకుంటే చాలు ఆపాత్రలో లీనమైపోయి యంగ్ హీరోలతో సమానంగా మారిపోతాడు. ముఖ్యంగా హీరోయిన్స్ తో రొమాన్స్ విషయంలో బాలకృష్ణ దూకుడు తట్టుకోవడం కష్టమని చాలామంది హీరోయిన్స్ ఓపెన్ గానే చెపుతూ జోకులు వేస్తూ ఉంటారు.