‘భారీ తారాగణం’ నుంచి ‘బాపుబొమ్మే చూస్తే’ పాట విడుదల

యువ నటీనటులు సదన్‌, దీపికా రెడ్డి, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భారీ తారాగణం’. శేఖర్‌ ముత్యాల దర్శకత్వం లో వస్తున్న ఈ చిత్రాన్ని బీవీఆర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై బీవీ రెడ్డి నిర్మిస్తున్నారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా ‘భారీ తారాగణం’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త పాటను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘బాపుబొమ్మే చూస్తే’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.

CLICK HERE!! For the aha Latest Updates