HomeTelugu Big Storiesభారత తొలి ఆస్కార్‌ విన్నర్‌ కన్నుమూత

భారత తొలి ఆస్కార్‌ విన్నర్‌ కన్నుమూత

Bhanu athaiya indias first
భారత తొలి ఆస్కార్‌ విన్నర్‌, ప్రసిద్ధ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ భాను అథయ్య గురువారం కన్నుమూశారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె (91) గురువారం తుదిశ్వాస తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె రాధిక గుప్తా ధృవీకరించారు. ఎనిమిది సంవత్సరాల క్రితం, మెదడులో కణితి కారణంగా గత మూడేళ్లుగా, ఆమె మంచానికే పరిమితయ్యారని తెలిపారు. చివరకు గురువారం తెల్లవారు ఝామున నిద్రలోనే కన్నుమూసినట్టు ఆమె చెప్పారు. దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో తమ తల్లి అంత్యక్రియలను పూర్తి చేసినట్టు రాధిక ప్రకటించారు.

1982లో గాంధీ చిత్రానికి దుస్తుల రూపకల్పనలో ఆమె కృషికి గాను కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. తద్వారా ఆస్కార్ అకాడమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలిగా అథియా ఘనత దక్కించుకున్నారు. గురుదత్ సూపర్ హిట్ మూవీ సీఐడీ (1956)లో ద్వారా కాస్ట్యూమ్ డిజైనర్‌గా కరియర్ ఆమె కెరీర్‌ ప్రారంభించారు. 50 సంవత్సరాల కెరీర్లో 100 చిత్రాలు, అనేక అవార్డులను అథియా అందుకున్నారు. తన మరణం తరువాత తన కుటుంబం ట్రోఫీని జాగ్రత్తగా చూసుకోలేదని భావించి తన అకాడమీ అవార్డును ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu