సల్మాన్‌ ‘సర్కస్‌’ మేకింగ్‌ వీడియో

బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ నటించిన చిత్రం ‘భారత్’. ఇందులో ఆయన 18 ఏళ్ల కుర్రాడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి (1964-2010) వరకు వివిధ లుక్‌లలో కనిపించనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌లో సల్మాన్‌ రష్యన్‌ సర్కస్‌లో స్టంట్‌మ్యాన్‌లా కనిపించారు. ప్రచార చిత్రాల్లో ఆయన తొలి ప్రేయసిగా దిశా పటానీ సందడి చేశారు. కాగా 1960ల కాలం నాటి ఆ సర్కస్‌ సెట్‌ కోసం 120 మంది ఆర్టిస్టులు కష్టపడ్డారట. ఈ మేరకు మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దీన్ని దిశా సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. ‘గ్రేట్‌ రష్యన్‌ సర్కస్‌కు స్వాగతం’ అని పోస్ట్‌ చేశారు.

‘1960 నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పట్లో వినోదం అంటే.. సర్కస్‌ ప్రధాన మార్గం. నా చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుని ఈ కథ రాశా. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 120 మంది ఆర్టిస్టులు ఈ సెట్‌ కోసం పనిచేశారు’ అని చిత్ర బృందం వీడియోలో పేర్కొంది. కొరియన్‌ సినిమా ‘యాన్‌ ఓడ్‌ టు మై ఫాదర్’ హిందీ రీమేక్‌గా ‘భారత్‌’ను రూపొందించారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకుడు. కత్రినా కైఫ్‌ మరో హీరోయిన్‌. జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషించారు. జూన్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates