HomeTelugu Trendingగొడవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్న బిగ్‌బాస్‌ జంట

గొడవలకు ఫుల్‌స్టాప్‌ పెట్టనున్న బిగ్‌బాస్‌ జంట

8 16

హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌13 ఎన్నో పోట్లాటలు, త్యాగాలు, ప్రేమలు, కోపాలు అన్నింటి మిళితంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కెప్టెన్సీ టాస్కులో తనకు మద్దతు ఇవ్వట్లేదని సిద్ధార్థ్‌ శుక్లాపై షెహనాజ్‌ ఫైర్‌ అయింది. కోపంలో కాస్త నోరు జారి నోటికొచ్చినట్లుగా తిట్టింది. దీంతో అప్పటి నుంచి వారిమధ్య మాటలు కరువయ్యాయి. గొడవ జరిగి రెండు రోజులు కావస్తున్నా వాళ్లు కలవకపోవడంపై అభిమానులు కలవరపడ్డారు. అయితే తాజాగా రిలీజ్‌ అయిన ప్రోమో ప్రకారం వాళ్లిద్దరూ గిల్లికజ్జాలు మాని మళ్లీ కలిసిపోయారని తెలుస్తోంది. ఈ ప్రోమో ప్రకారం.. చిన్న గొడవ వారి మధ్య రిలేషన్‌షిప్‌ను చెడగొడుతుందని భావించిన షెహనాజ్‌ సిద్ధార్థను పలకరించింది. అలిగి పడుకుని ఉన్న సిద్ధార్థ్‌ను ఆమె తన ఒడిలోకి తీసుకుని బుజ్జగించింది.

‘ఇక చాలు..’ అంటూ సిద్ధార్థ్‌ ఆమెతో విసురుగా మాట్లాడినప్పటికీ ఆమె దాన్ని పట్టించుకోలేదు. ‘నువ్వు లేకుండా నేను ఉండలేను’ అంటూ షెహనాజ్‌ గద్గద స్వరంతో మాట్లాడింది. ఈ వీడియోను చూసిన అభిమానులు ‘వాళ్లిద్దరు కలిసిపోయారోచ్‌..’ అంటూ పండగ చేసుకుంటున్నారు. ‘షెహనాజ్‌ ప్రవర్తన వల్లే సిద్ధార్థ్‌ ఎంతగానో బాధపడ్డాడు. అతనికి ఇంట్లో ఎంతోమంది స్నేహితులున్నారు. కానీ అతని బాధను అర్థం చేసుకోగలిగేవారు ఎవరూ లేరు. అతన్ని అలా దిగులుగా చూడలేకపోతున్నాం అని ఓ అభిమాని కామెంట్‌ చేశాడు. ‘మనుషులన్నాక తప్పు చేయడం సహజం. కానీ షెహనాజ్‌ తాను చేసింది పొరపాటని గ్రహించి దాన్ని సరిదిద్దుకోడానికి ప్రయత్నించింది’ అని మరికొందరు కామెంట్‌ చేశారు. ఎట్టకేలకు నేటి ఎపిసోడ్‌లో ఈ జంట కలిసిపోనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!