HomeTelugu Trendingరాహుల్‌ రీ ఎంట్రీ ఆనందంలో పునర్నవి

రాహుల్‌ రీ ఎంట్రీ ఆనందంలో పునర్నవి

3 22బిగ్‌బాస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటిసభ్యులు చేసిన సందడి అంతా ఇంతా కాదు.. ఒకవైపు వారి డాన్స్‌లతో షోను హోరెత్తించగా మరోవైపు గద్దలకొండ గణేష్‌ ఎంట్రీతో ఎపిసోడ్‌ మరింత హుషారుగా సాగింది. అతిథిగా వచ్చిన వరుణ్‌తేజ్‌.. హిమజ ఎలిమినేట్‌ అయినట్లుగా ప్రకటించగా ఆమె కన్నీటితో వీడ్కోలు పలికింది. ‘మళ్లీ నీకు బిగ్‌బాస్‌ ఇంట్లోకి వెళ్లే అవకాశం వస్తే ఏం చేస్తావు’ అని కింగ్‌ నాగార్జున అడిగిన ప్రశ్నకు వెళ్లే ప్రసక్తే లేదని హిమజ నిర్మొహమాటంగా చెప్పింది. ‘ఒక్కసారి బయటకు వచ్చాక మళ్లీ ఇంట్లోకి వెళ్లడం ఫేర్‌ కాదు, అది వన్‌టైమ్‌ డ్రీమ్‌ మాత్రమే’ అని ముక్కుసూటిగా సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తొమ్మిదో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ అంటూ అందర్నీ షాక్‌లోకి నెట్టేసిన నాగార్జున అది ఫేక్‌ అని చెప్పాడు. కాగా శనివారం రాహుల్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ఎలిమినేట్‌ అయ్యాడని నమ్మించి గేమ్‌ ఆడించి ఆఖరి క్షణంలో అబద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఒకానొక దశలో రాహుల్‌ లేకపోతే బిగ్‌బాస్‌ చూడటమే ఆపేస్తానని కొందరు అభిమానులు శపథం పూనారు. కానీ రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌ అని తెలియడంతో ఎగిరిగంతేస్తున్నారు. ఇక ఈ విషయం ఇంటిసభ్యులకు తప్ప అందరికీ తెలుసు. మరి రాహుల్‌ రీ ఎంట్రీని ఇంటిసభ్యులు ఎలా స్వీకరిస్తారో!

ఇక రాహుల్‌ను సీక్రెట్‌ రూంలోకి పంపించి అతను లేకుండానే ఆదివారం ఎపిసోడ్‌ కంటిన్యూ చేశారు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమో ప్రకారం నేటి ఎపిసోడ్‌లో రాహుల్‌ రీఎంట్రీతో ఇంటిసభ్యులకు షాక్‌ ఇచ్చాడు. రాహుల్‌ గొంతు వినగానే మొదట షాకైన పునర్నవి.. తర్వాత పట్టరాని సంతోషంతో గెంతులేసింది. రాహుల్‌ గ్రాండ్‌ ఎంట్రీతో ఇరగదీసాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ సీజన్‌లో ఇదే బెస్ట్‌ ప్రోమో అంటూ రాహుల్‌ అభిమానులు అంటున్నారు. ఎలిమినేషన్‌ వరకు వెళ్లి వెనుదిరిగి రావటం అంటే మామూలు విషయం కాదు.. మరి ఈ గోల్డెన్‌ చాన్స్‌ను రాహుల్‌ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!