శ్రీముఖికి బిగ్‌షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో.. నామినేషన్‌ ప్రక్రియ అనేది ఎంతటి వారికైనా కునుకు లేకుండా చేస్తుంది. హౌస్‌మేట్స్‌లో అప్పటి వరకు ఉన్న ప్రవర్తనకు భిన్నంగా మార్పులు కనిపిస్తాయి. అయితే అక్కడ ఇది నిరంతరం చర్య. ప్రతీవారం నామినేషన్‌కు వెళ్లడం.. అదృష్టం ఉంటే ఎలిమినేషన్‌ నుంచి తప్పించుకుంటారు లేదా నిష్క్రమిస్తారు. అయితే ఎలాంటి తప్పు చేయకుండా, నామినేషన్‌లో సరైన కారణాలు చెప్పకుండా నామినేట్‌ అయితే వారు మరింత బాధపడుతూ ఉంటారు.

ఈ సీజన్‌లో బిగ్‌బాస్‌ ఆగ్రహానికి గురై.. నేరుగా నామినేట్‌ అయిన వారున్నారు. గతంలో శివజ్యోతి, రోహిణి, శ్రీముఖిలను నేరుగా నామినేట్‌ చేశాడు. అయితే దురదృష్టం వెంటే ఉండటంతో రోహిణి ఎలిమినేట్‌ అయింది. టాస్క్‌లో క్రూరంగా ప్రవర్తించినందుకు శ్రీముఖిని నేరుగా నామినేట్‌ చేసేశాడు. అయితే లక్కు పక్కనే ఉండటంతో బతికిపోయింది. అయితే శ్రీముఖికి అలాంటి అనుభవమే మరోసారి ఎదురైనట్లు కనిపిస్తోంది.

తొమ్మిదో వారానికి గానూ నామినేషన్‌ ప్రక్రియను మొదలుపెట్టిన బిగ్‌బాస్‌.. గార్డెన్‌ ఏరియాలో టెలిఫోన్‌ బూత్‌ను ఏర్పాటు చేశాడు. అయితే అందులో ఉన్న ఫోన్‌ రింగ్‌ అవుతుండటంతో.. ఆతృత్రని ఆపుకోలేని శ్రీముఖి ఫోన్‌ను లిఫ్ట్‌ చేసింది. దీంతో శ్రీముఖిని బిగ్‌బాస్‌ మరోసారి నేరుగా నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈసారి అదృష్టం కలిసి వచ్చి సేవ్‌ అవుతుందా? అన్నది చూడాలి.