HomeTelugu Trendingషాకింగ్‌: బిగ్‌బాస్‌నుండి గంగవ్వ ఔట్‌?

షాకింగ్‌: బిగ్‌బాస్‌నుండి గంగవ్వ ఔట్‌?

Gangavva out in this weekతెలుగు బిగ్‌బాస్ సీజ‌న్‌-4 వీకెండ్‌ కావడంతో ఎలిమినేషన్స్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ షోలో గంగ‌వ్వ స్థానం ప్ర‌త్యేక‌మైన‌ది. షో ప్రారంభ‌ంలోనే ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాడు బిగ్‌బాస్‌. ఇక ఈ వయస్సులో కూడా గంగవ్వ బిగ్‌బాస్‌ ఇంటి ఉండగలగుతుంది. తన వంతు టాస్క్‌కు చేస్తుంది. అయితే ఆమ‌ధ్య త‌న ఆరోగ్యం బాగోలేద‌ని, ఇంటికి వెళ్లిపోతాన‌ని అంది అవ్వ. బిగ్‌బాస్ ఆమెకు వైద్యం చేయించి మ‌రికొన్ని రోజులు ఇంట్లోనే ఉంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఆమె తిరిగి కోలుకొని ఎప్ప‌టిలాగే హుషారుగా క‌నిపించ‌డంతో ఇప్ప‌ట్లో అవ్వ బ‌య‌ట‌కు వెళ్ల‌ద‌ని అంద‌రూ డిసైడ్ అయ్యారు.

కానీ నిన్న‌టి ఎపిసోడ్‌లో ఆమెకు మ‌ళ్లీ ఇంటిపై ప్రాణం కొట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండ‌లేక‌పోతున్నాన‌ని వాపోయింది. క‌డుపు నిండా తినే త‌న‌కు ఇక్క‌డ పిడికెడు ముద్ద కూడా లోప‌లికి వెళ్ల‌ట్లేద‌ని భోరుమ‌ని ఏడిచింది. అయితతే బిగ్‌బాస్ ఈసారి ఆమె వేద‌న‌ను అర్థం చేసుకుని ఇంటి నుంచి బ‌య‌ట‌కు పంపించేసిన‌ట్లు స‌మాచారం. అనారోగ్య కార‌ణాల వ‌ల్లే ఆమెను షో నుంచి త‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ వార్త‌ విన్న‌ గంగ‌వ్వ ఫ్యాన్స్‌ మాత్రం కొంచెం నిరుత్సాహ పడ్డారు. గంగ‌వ్వ అభిమానులు మాత్రం రేప‌టి నుంచి అవ్వ లేకుండా షో ఎలా చూడ‌గ‌ల‌మ‌ని అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో మరికాసేపట్లో తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!