HomeTelugu Big Storiesబిగ్‌బాస్ న్యూ ప్రోమో.. అంతకు మించి అంటున్న నాగార్జున

బిగ్‌బాస్ న్యూ ప్రోమో.. అంతకు మించి అంటున్న నాగార్జున

Bigg Boss 4 Telugu another

ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టిల్స్, గ్లింప్స్ రిలీజ్ చేసిన సంస్థ ఇప్పుడు తాజా ప్రోమోను విడుదల చేసింది. ఇందులో నాగార్జున 3 పాత్రల్లో కనిపిస్తున్నాడు. తాత, మనవడు కలిసి పక్కింటి గొడవలను చూసి ఆనందిస్తూ ఉంటారు. ఇంతకంటే ఎంటర్‌టైన్‌ మెంట్ ఏం ఉంటుంది అంటూ తాతా మనవళ్లు చెప్తారు. నాగార్జున వచ్చి ఇంతకంటే 100 రెట్ల మంచి ఎంటర్‌టైన్‌మెంట్ నేను సెట్ చేస్తాను అంటాడు. అంటూ బిగ్‌బాస్ షో గురించి చెప్తాడు. తీయండి రిమోట్, ఫిక్స్ అవండి బిగ్‌బాస్.. నిజమైన ఎమోషన్స్, అసలైన ఎంటర్‌టైన్‌మెంట్ ఇక్కడ అంతా లైవ్ అనే డైలాగ్‌తో ఆకట్టుకుంటాడు నాగార్జున.

ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 గతంలో కంటే ఈసారి భిన్నంగా ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే, షో ప్రారంభానికి ముందే కంటెస్టెంట్లు క్వారంటైన్‌కు వెళ్లనున్నారు. పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే హౌస్‌లోకి అనుమతించనున్నారు. ఈసారి బిగ్ బాస్ సీజన్-4 తక్కువ వారాలు ఉండే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu