ఆ యంగ్ హీరోతో స్టార్ హీరోయిన్స్!

తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ తో కలిసి నటించడానికి అగ్ర తారలు నయనతార, సమంత వంటి వారు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘రెమో’ సినిమా తెలుగులో కూడా విడుదలయింది. నటుడిగా ఆయనకు ఈ సినిమాతో తెలుగులో కూడా మంచి పేరు వచ్చింది. దీంతో ఇకపై ఆయన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈ సినిమా తరువాత పొన్ రామ్ దర్శకత్వంలో ‘రుత్తపడాద వాలిబర్ సంఘం’,’రజినీ మురుగన్’ వంటి సినిమాలు చేయడానికి కార్తికేయన్ అంగీకరించాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నయనతార, సమంతలతో పాటు తమన్నా కూడా ఈ హీరోతో జత కడుతోందని టాక్. రవికుమార్ దర్శకత్వంలో ‘ఇండ్రు నేట్రు నాలై’ అనే సినిమాలో శివకార్తికేయన్ కు జంటగా తమన్నాను తీసుకోవాలనే ఆలోచన చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరుసగా స్టార్ హీరోయిన్లతో జతకట్టి కార్తికేయన్ కూడా స్టార్ హీరోగా మారిపోతాడేమో చూడాలి!
 
 
Attachments