Homeపొలిటికల్రాయలసీమ ఎత్తిపోతలను బలిపశువును చేయాలని చూస్తున్న బి జె పీ?

రాయలసీమ ఎత్తిపోతలను బలిపశువును చేయాలని చూస్తున్న బి జె పీ?

తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు ఆంధ్రప్రదేశ్లోని సగానికి పైగా జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే రాయలసీమ ఎత్తిపోతల పధకాన్ని బలిపశువును చేయాలని కేంద్రంలో అధికారం లో ఉన్న బి జె పీ ప్రయత్నిస్తోందా అంటే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణాలో అంతో, ఇంతో బలంగా ఉన్న బి జె పీ కనుచూపు మేరలో ఏ పీ లో బలపడే అవకాశాలు కనిపించటం లేదు. ఏ పీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ ఎత్తి పోతల పథకాన్ని నిలువరించడం ద్వారా తెలంగాణ కు అన్యాయం జరగకుండా అడ్డుకున్నామని చెప్పటం ద్వారా ఈ ప్రాంతం లో బలపడాలని బి జె పీ చూస్తోంది. ఇలా చేయటం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే భావనతో బి జె పీ మంత్రగమ్ నడిపిస్తోంది. ఇందుకు వచ్చే వారం లో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తో పాటు, జాతీయ హరిత ట్రిబ్యునల్ ను ఉపయోగించుకోనుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల కు పర్యావరణ అనుమతులు అక్కర్లేదని హరిత ట్రిబ్యునల్ చెప్పింది. ఇది కొత్త ప్రాజెక్ట్ కాదని కూడా తేల్చి చెప్పింది. హరిత ట్రిబ్యునల్ ఇలా ప్రకటన చేయటం, ఏ పీ ఈ ప్రాజెక్ట్ టెండర్లు చేపట్టటం, వాటిని ఖరారు చేయటం కూడా పూర్తి ఐంది. ఈ ప్రాజెక్ట్ ను ఏ పీ చేపట్టిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో విపక్షాలు స్థానిక ప్రభుత్వం పై విమర్శలు ప్రారంభించారు . ఏ పీ కి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. విపక్షాల దాడి ఎక్కువ కావటం తో ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ అడ్డుకుంటామని చెప్పింది. హరిత ట్రిబ్యునల్ ఈ ప్రాజెక్ట్ కు సానుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులను పునః సమీక్షించాలని ఇదే సమయంలో కేంద్రం ఆ సంస్థను కోరింది. ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ప్రధాన ప్రతిపక్షం టి డి పీ , ఆ పార్టీ ఏమి చెబితే అదే మాటలను వల్లే వేస్తున్న కాంగ్రెస్, సి పీ ఐ వంటి పార్టీలు తమ రాష్ట్రానికి ప్రయోజనం కలిగే ప్రాజెక్ట్ కు మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికారపక్షం పై విమర్శలు చేస్తున్నాయి. బి జె పీ తెలంగాణ శాఖ ఈ ప్రాజెక్ట్ ను వ్యతిరేకిస్తుంటే ఏ పీ శాఖ మాత్రం అనుకూలంగా ప్రకటనలు చేయటం లేదు. ఏ పీ లో ఇప్పట్లో మనం బలపడేది లేదు కాబట్టి తెలంగాణ కు మేము అనుకూలంగా వ్యవహరిస్తాం మీరు మౌనంగా ఉండండి అని స్థానిక నేతలతో కేంద్రంలోని పెద్దలు మాట్లాడారని ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

Krishna Water Dispute 2

కృష్ణా వరద నీటిని వినియోగించుకునే విధంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 25న నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కోవిడ్ బారిన పడటంతో ఈ సమావేశం వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్. తొలుత ఈ నెల 5 న ఈ సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఆ రోజున తనకు వీలుకాదని తెలంగాణ సిఎం కే సి ఆర్ చెప్పటం తో వాయిదా వేసిన కేంద్రం ఈ సారి ఏ పీ, తెలంగాణ సి ఎం లకు చెప్పకుండానే మీటింగ్ తేదీని ఖరారు చేసారని సమాచారం. రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఏళ్లుగా ఉన్నాయి. నీటి పంపకానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపు అమలులోకి రావాల్సిన సమయంలోనే తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర – తెలంగాణ విడిపోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉన్నాయి. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ కనుచూపుమేరలో కూడా ఉనికిని చాటుకోలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీంతో ఒక రాష్ట్రం చేపట్టిన పధకాన్ని ఆపటం ద్వారా రెండో రాష్ట్రం లో లబ్ది పొందవచ్చు,ప్రాజెక్ట్ చేపట్టిన రాష్ట్రం ను నియంత్రిచవచ్చనే ఆలోచన తోనే బి జె పీ ఇంట పట్టుదలగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 114 టిఎంసిల నీటిని రాయలసీమకు తరలించాలి. గత 15 సంవత్సరాల నీటి తరలింపును పరిశీలిస్తే రెండు సంవత్సరాలు మినహాయిస్తే ఏ ఏడాది సగం నీటిని మళ్లించలేకపోయారు. రాయలసీమకు తెలుగు గంగ (29 టిఎంసీలు), ఎస్.ఆర్.బి.సి (19), గాలేరు-నగరి-జిఎన్ఎస్ఎస్ (39), చెన్నైకి తాగు నీరు (15), టిబిపిహెచ్ ఎల్ సి (10), తాగు నీటి అవసరాలు- ఆవిరి నష్టాలు (3 టిఎంసీలు) కలిపి మొత్తం 114 టిఎంసీల నీటిని వినియోగించాలి. 2004-05లో 56.51, 2005-06లో 78.49, 2007-08లో 48.05, 2009-10లో 60.14 టిఎంసిల నీటిని రాయలసీమకు తరలించారు. ఇదే ఏడాది కృష్ణాకు భారీ వరద వచ్చింది. 2012-13లో అతి తక్కువగా 22.49 , 2014-15లో 59.17 నీటిని టి ఎం సి ల నీటిని తరలించారు. 2015-16లో అత్యల్పంగా కేవలం 0.95 అంటే ఒక టిఎంసి నీటిని కూడా విడుదల చేయలేదు. గత నాలుగేళ్లలో అంటే 2016-17 నుంచి 2019-20 వరకు వరుసగా 67.44, 91.70,115.40, 179.30 టిఎంసిల నీటిని తరలించారు.ఈ పరిస్థితుల్లో కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొని వృధాను అరికట్టేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపి ప్రభుత్వం చేపట్టింది. ఇది కొత్త పథకం కాదని ఎన్జీటి ఆదేశాల మేరకు ఏర్పడిని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటి తేల్చిచెప్పింది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు లేనేలేదు. పాత ఆయకట్టుకు నీటిని శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా సంగమేశ్వరం దగ్గర పంపింగ్ కేంద్రాన్ని నిర్మించి తరలించేందుకు ఇది ఉపయోగ పడుతుంది. అందువల్ల ఈ ప్రాజెక్ట్ను కొత్త ప్రాజెక్ట్గా పరిగణించాల్సిన అవసరం లేదు. కేటాయించిన నీటిని ఉపయోగించుకునేందుకు మాత్రమే వీలవుతుంది.

Krishna Water Dispute 1

ఏపిలోని రాజకీయ పార్టీలు , ఎల్లో మీడియా ఈ ప్రాజెక్ట్ కు అనుకూలంగా మాట్లాడడం లేదు. తేలుకుట్టిన దొంగల్లా తెలుగుదేశం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ, వాటి అనుకూల మీడియా వ్యవహరిస్తున్నాయి. అనుకూలంగా మాట్లాడితే ప్రజలు, ముఖ్యంగా రైతులకు మాడడు ఇచ్చినట్లు అని కాకుండా తమ రాజకీయ శత్రువుకు మద్దతు ఇచ్చినట్లు ఇవి భావిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టుకు సొంత రాష్ట్రంలో మద్దతు లేదు. పక్క రాష్ట్రంలో వ్యతిరేక వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిని కౌంటర్ చేయాల్సిన ఏ పీ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది . రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవటం, ప్రాజెక్ట్ కు అనుకూలమైన వర్గాలను సమీకరించటంలో పూర్తిగా విఫలమైంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచలేకపోతోంది. ఇంతవరకు ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, అధికార పార్టీ నేతలుగానీ నోరు విప్పి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. . దీంతో ఏపి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని తెలంగాణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలో అభిప్రాయం బలంగా నెలకొంటోంది.

ఏ పీ సి ఎం తో తెలంగాణ సి ఎం కుమ్మక్కు కావడం వల్లనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పై నోరు మెదపటం లేదని తెలంగాణ బి జె పీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శించాయి. కాంగ్రెస్ నేతలు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. ఎన్జీటిలో కేసు వేసినా టెండర్ ప్రక్రియ నిర్వహించుకునేందుకు అది అనుమతిచ్చింది . తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఇవన్నీ విచారణ జరగాల్సి ఉంది. ఎన్జీటి అనుమతి మేరకు ఏపి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకానికి టెండర్ ప్రక్రియను ముగించింది.ఈ నేపధ్యం లో తెలంగాణ బిజెపి నాయకుల వాదనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏ పీ పట్ల స్థానిక బి జె పీ నేతలు పూర్తి వ్యతిరేకత, అనుకూలత లేకుండా వ్యహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అదే తీరుగా వ్యవహరిస్తోంది. తెలంగాణ పట్ల బి జె పీ , కేంద్రం రెండు వ్యతిరేకంగానే ఉన్నాయ్. లోక్ సభ ఎన్నికల తరువాత టిఆర్ఎస్తో బిజెపికి సంబంధాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ప్రతీ చిన్న అంశంపైన బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తుంటే వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి తాఖీదులు పంపుతోంది. గతంలో ఈ విధంగా ఉండేది కాదు. నీటి విషయానికి వస్తే కాళేశ్వరం మూడో టిఎంసీ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ బిజెపి నాయకులు చేసిన ఫిర్యాదులకు అనుకూలంగా కేంద్ర మంత్రిత్వ శాఖలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. కేంద్రంలోని బిజెపి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వన్ నేషన్ విధానాన్ని అన్ని విభాగాల్లోనూ అమలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పుడు నీటి పారుదల రంగంలో కూడా అదే ప్రయోగం చేస్తోంది. ఈ తరుణం లో ఈ రాష్ట్రాల మధ్య వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందననే వాదన బలంగా వినపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం జుట్టును తమ చేతుల్లో ఇరికించుకోవాలంటే కాళేశ్వరం మూడో టిఎంసీ పనులు, పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రం తో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకాల డిపిఆర్లు ఇవ్వటం తో పాటు పనులు ఆపేయాలని కేంద్రం అపెక్స్ కౌన్సిల్ ద్వారా ఆదేశాలు ఇప్పించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. . ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించవద్దని కేంద్రం ఆదేశించింది. ఈ విధంగా మొత్తం వ్యవహరాన్ని తమ కనుసన్నల్లో తిప్పుకోవడం ద్వారా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి ఈ ప్రాంతంలో బలపడాలనేది బిజెపి వ్యూహమా అనే అనుమానం ఇంజనీరింగ్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏపిలో బలపడే అవకాశం లేదు, తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే టిఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టి ఈ ప్రాంతానికి మేలుచేస్తున్నట్లు కలర్ ఇవ్వటమే మేలనేది బి జె పీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే రెండు రాష్ట్రాలు వినియోగించుకోకుండా కృష్ణా నీరు వృధాగా సముద్రం పాలవతామే కాకుండా అటు రాయలసీమ, ఇటు దక్షిణ తెలంగాణ శాశ్వతంగా కరువుబారిన పడతాయి.

Krishna Water Dispute

తెలంగాణలో కృష్ణా నీటి ఆధారిత ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ను మూడేళ్ళలో పూర్తిచేసి తెలంగాణ ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారు. ఊహించని విధంగా ఎక్కడో ఉన్న గోదావరి నీటిని పంపింగ్ ద్వారా హైదరాబాద్ దగ్గరవరకు తీసుకురావడం ద్వారా ఆయన అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అదే విధంగా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి శ్రద్ధ చూపడం లేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. దక్షిణ తెలంగాణలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్ట్లను పూర్తిచేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతోపాటు కృష్ణా నీటిని గరిష్టంగా వాడుకోవడం సాధ్యమవుతుంది. ఏపిలో రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగు నీరు అందించడానికి వరద, మిగులు, నికర జలాల కేటాయింపులు న్నాయి. కొన్ని పథకాలు పూర్తయి మరికొన్ని పథకాలు నిర్మాణంలో ఉన్న కేటాయించిన నీటిని ఏపి వినియోగించుకోలేకపోతోంది.

రెండు రాష్ట్రాలు సాగునీటి రంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తు గోదావరి పై కాళేశ్వరం, పోలవరం లాంటి ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నాయి. తెలంగాణలో కృష్ణ నది పై పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయసముద్రం, ఎస్ఎల్బిసి లాంటి ప్రాజెక్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. ఏపిలో హంద్రి-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్ట్లు నిర్మాణం చివరిదశలో ఉన్నాయి. వరద నీరు వృధా అవుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లు పూర్తి చేసిన కృష్ణాలో నీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి లేదు. గత ఏడాది 600 ల టిఎంసీలు వృధా అయ్యింది. ఒకవేళ కృష్ణాలో నీటి సమస్య ఎదురైనప్పటికీ గోదావరి నీటి మళ్లింపు ఆధారంగా అధిగమించడం వీలవుతుంది. పోలవరం నిర్మాణం , కృష్ణా-పెన్నా నదుల అనుసంధానం పూర్తయిన తరువాత కృష్ణా నదిపై ఆధారపడడం తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి అధికనీటిని వినియోగించుకునే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పటిష్టమైన కార్యాచరణను అమలు చేయాలి. శ్రీశైలం జలాశయాన్ని విద్యుత్ ఉత్పత్తికి బదులు పూర్తిగా సాగు, తాగు నీటి అవసరాల కోసం వినియోగించుకోవచ్చు. తెలంగాణ ముఖ్యంగా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ రెండు ప్రాంతాల్లోనూ తాగు, సాగు నీటి సౌకర్యాలు మెరుగుపరచడానికి పైన పేర్కొన్న సాగునీటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu