HomeTelugu TrendingTollywood Pan India Movies 2024: బాలీవుడ్​ కూడా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తోంది!

Tollywood Pan India Movies 2024: బాలీవుడ్​ కూడా ఈ సినిమాల కోసం ఎదురుచూస్తోంది!

Tollywood Pan India Movies 2024
Tollywood Pan India Movies 2024 : సాధారణంగా సమ్మర్‌లో ఎక్కువ సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయి. కానీ 2024 సమ్మర్‌ సీజన్‌ అందుకు భిన్నంగా ఉంది. మే వరకు ఒక్క భారీ తెలుగు మరియు హిందీ సినిమాలు థియేటర్లలోకి రావడం లేదు. కాగా మే 9న విడుదల కావల్సిన ప్రభాస్‌ కల్కి మూవీ కూడా ఎన్నికల కారణంగా వాయిదా పడింది.

దీనితో పాటు.. పుష్ప, దేవర, గేమ్‌ ఛేంజర్‌ పలు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అయితే.. ఈ భారీ తెలుగు సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులే కాదు బాలీవుడ్ కూడా ఎదురు చూస్తోంది. టాలీవుడ్‌ మాత్రమే కాదు బాలీవుడ్‌లో కూడా ఈ సమ్మర్‌లో పెద్దగా సినిమాలు రిలీజ్‌ కాకపోవడంతో.. ఈ సినిమాలకోసం బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు.

గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాల్లో సౌత్‌ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్‌ను కేజీఎఫ్‌ 1, కేజీఎఫ్‌ 2, పుష్ప 1, కార్తికేయ 2 కొనసాగించాయి. ఇటీవల హనుమాన్‌ కూడా ఉత్తరాది ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్​లో పఠాన్, జవాన్​, ఓ మైగాడ్​ 2, గద్దర్​తో పాటు మరో రెండు మూడు చిత్రాలు మాత్రమే ఆడాయి.

బాలీవుడ్‌లో ఇటీవలే సమ్మర్ బాక్సాఫీస్ ముందు భారీ అంచనాలతో వచ్చిన బడే మియాన్ చోటే మియాన్, మైదాన్ సినిమాలు కూడా వసూళ్లు అందుకోవడంలో, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కాస్త నిరాశపరిచాయి. దీంతో సమ్మర్​ బాక్సాఫీస్‌ వద్ద సందడి కనిపించలేదు.

తెలుగు సినిమా పరిస్థితి విషయానికి వస్తే, దేవర, కల్కి 2898 AD వంటి భారీ-బడ్జెట్ మూవీల విడుదల వాయిదా పడడంతో ఇండస్ట్రీలో గ్యాప్‌ వచ్చింది. మధ్యలో టిల్లు స్క్వేర్ మినహా ఇతర చిన్న సినిమాలు అవకాశాన్ని అందిపుచ్చుకుని వసూళ్లు సాధించలేకపోయాయి. అయితే త్వరలో.. వాయిదా పడ్డ టాలీవుడ్‌ భారీ సినిమాలు విడుదల కానున్నాయి.

కల్కి 2898 AD: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ దీపిక, అమితాబ్‌, కమల్‌ హాసన్‌ వంటి బిగ్‌ స్టార్‌లు నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాల ఉన్నాయి.

దేవర: జూనియర్‌ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాల ఉన్నాయి.

గేమ్ ఛేంజర్‌: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. రామ్‌ చరణ్‌ ద్విపాత్రభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ప-2: అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాల ఉన్నాయి. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాల కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2, దేవర డబ్బింగ్ వెర్షన్లు, తమిళ స్టార్‌ సూర్య కంగువ మూవీలు హిందీ రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్‌ కానున్నాయి. ఇక ఈ చిత్రాలే కష్టాల్లో ఉన్న బాలీవుడ్‌ను మరోసారి ఆదుకునేందుకు రెడీగా ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!